సోషల్ మీడియాలో ఆల్బమ్ సాంగ్స్, వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ వంటివి చేస్తూ చాలా మంది భారీగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక అందులో కొంతమంది సినిమాల కి కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కొందరు బుల్లితెరకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు అయితే తాజాగా ఇప్పుడు ఈ లిస్టులోకి చేరాడు సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్. అయితే గత కొంత కాలం క్రితం ఈయన గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పట్లో ఈ వార్త ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక

 అప్పటినుండి సోషల్ మీడియాలో కనిపించడం లేదు ఈ కుర్రాడు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ కుర్రాడు టాలీవుడ్ ని ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి ఆయన వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ వంటివి చేస్తూ పలు సినిమాల్లో కూడా నటించాడు. తాజాగా ఇప్పుడు ఒక సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ కూడా ఘనంగా జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. షణ్ముఖ్ జస్వంత్ హీరోగా

 అనఘా అజిత్ హీరోయిన్గా పవన్ కుమార్ అనే దర్శకుడు ఈటీవీ విన్ కోసం ఒక వెబ్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ అఖియన్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ అందించారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన లాంచింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షాట్ ని సుబ్బు డైరెక్ట్ చేయగా బేకింగ్ వేణుగోపాల్ క్లాప్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈయన ఇదివరకే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కి కూడా వచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: