మాస్ మహారాజా రవితేజ హిట్ ఫ్లాప్స్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్లకి అవకాశాలను ఇస్తూ స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు. ఇందులో భాగంగానే ఆయన చేసిన ధమాకా సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ దమకాంత స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయాయి. చేసిన మూడు సినిమాలు కూడా ప్లాప్టాప్ తెచ్చుకోవడంతో ఇప్పుడు చేయబోయే సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలి

 అని భారీ ప్రయత్నాలు చేస్తున్నాడు మాస్ మహారాజ. ఇందులో భాగంగానే ఈ గెలిచిన మా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావాలి అనే మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించబోతోంది. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రైడ్

 సినిమాకి రీమేక్ గా రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో రవితేజ అమితాబచ్చన్ కి పెద్ద ఫ్యాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక అప్డేట్ తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. కానీ అదే రోజు ఎన్టీఆర్ దేవర ఉండటంతో మల్లి పోస్టుపోన్ చేస్తారు అని అనుకుంటున్నారు. 'మిస్టర్‌ బచ్చన్‌..నామ్‌ తో సునా హోగా' అని రవితేజ చెప్పిన డైలాగ్‌ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా నిజాయితీపరుడైన ప్రభుత్వ అధికారిగా రవితేజ నటించారు. మిస్టర్ బచ్చన్ లక్నో, కారైకుడి మరియు హైదరాబాద్‌లో చిత్రీకరించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: