ఒకప్పటి సీనియర్ హీరోలు ఇప్పుడున్న యంగ్ హీరోల కంటే డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. అలాగే వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. మరి ముఖ్యంగా కొందరు సీనియర్ హీరోలైతే రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటిస్తున్నారు. అంతేకాదు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి కూడా వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే ఇక సీనియర్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు  వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే రెండు మూడు సినిమాలు వచ్చాయి. ఇక వచ్చిన ఆ రెండు

 మూడు సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో మరొకసారి సినిమా రాబోతోంది. ఇకపోతే వెంకటేష్ చివరిగా సైంధవ్ సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు నెక్స్ట్ సినిమా తో అయినా భారీ విజయని అందుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు వెంకటేష్. ఇకపోతే ఇప్పుడు వెంకటేష్ అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నాడు. గత సినిమా ఫ్లాప్ అవడంతో అనిల్  తో సినిమా కోసం ఏ పని చేయడానికి అయినా సిద్ధంగా

 ఉన్నాడు ఒకప్పటి సీనియర్ హీరో వెంకటేష్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమాలో వెంకటేష్తో ఒక లిప్ లాక్ సన్నివేశం చేయించడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే ఇందులో మీనాక్షి చౌదరితో వెంకటేష్ లిప్ లాక్స్ సన్నివేశంలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: