కమల్ కి భయపడి వెనక్కి తగ్గిన ధనుష్?


తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, సన్ పిక్చర్స్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి నిర్మాణంలో తెరకెక్కిన 'రాయన్' సినిమా జూన్ 26 వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కానున్నట్లు సమాచారం తెలుస్తుంది. లోక నాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా తరువాత ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎందుకంటే ఇండియన్ 2 తో పాటు రిలీజ్ అయితే సినిమాకి వసూళ్లు తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి ధనుష్ వెనక్కి తగ్గి రాయన్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు.నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ అయిన ధనుష్ యాక్టర్ గా తన ఈ 50వ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ అనేది వచ్చింది.తాజాగా మేకర్స్ పోస్ట్ పోన్ చేసి రాయన్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూన్ 26 వ తేదీన ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. అంటే కొత్త విడుదల తేదీ ధనుష్ 41వ పుట్టినరోజుకి రెండు రోజుల ముందు వస్తుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను చాలా గ్రాండ్ గా విడుదల చేయనుంది.


అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ధనుష్ ఇంటెన్స్ పవర్ ఫుల్ లుక్ అయితే ఎంతగానో అదిరిపోయింది.ఫస్ట్‌క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో హై టెక్నికల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఇంటర్నేషనల్ మ్యూజిక్ కంపోజర్ ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్ గా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఇంకా అలాగే పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.ఈ చిత్రంలో సమిష్టి తారాగణం SJ సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి, శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: