ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు వెళుతుంటారు అయితే కొంతమంది స్టార్ హీరోలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరం అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.అలాంటి వారిలో నటి నమిత ఒకరు. సొంతం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు అనంతరం జెమిని బిల్లా వంటి పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నమిత ఉన్నఫలంగా శరీర బరువు పూర్తిగా పెరిగిపోయారు.దాంతో ఈమెకు అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఇక అవకాశాలు వచ్చిన హీరోయిన్గా మాత్రం కాకుండా చిన్న చిన్న పాత్రలలో తనకు అవకాశాలు రావడంతో ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైనటువంటి నమిత తమిళ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడికి వెళ్లారు అయితే అక్కడ మాత్రం సక్సెస్ అయ్యారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలలో నటించిన నమితకు తమిళ అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టేశారు.

తెలుగు ప్రేక్షకులకు నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొంతం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ బొద్దుగుమ్మ మొన్నటి సింహా చిత్రంలోనూ విశేషంగా అలరించింది. నమిత 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరి అనే నిర్మాతను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కవల మగ పిల్లలు జన్మించారు.అయినప్పటికీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 2020లో మాయ మూవీ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇటీవల ఇద్దరు కవల పిల్లలు జన్మనిచ్చి వారిని చూసుకుంటుంది. మళ్లీ నమిత ఇటీవల ఎన్నికల ప్రచారంలో కనిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఎమోషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. '' పెళ్లి తర్వాత 2021లో నాకు మొదటి ప్రెగ్నెంట్ వచ్చింది. ఈ విషయాన్ని మా వాళ్లతో సంతోషంగా పంచుకున్నాను. కానీ ఆ సంతోషంగా ఎక్కువ కాలం నిలువలేదు. నాలుగు నెలల్లోనే గర్భస్రావం అయింది. దీంతో బాధను భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత నా భర్త వల్ల బాధ నుంచి బయటకు వచ్చా. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. మూడు నెలలకే ట్విన్స్ అని తెలియడంతో.. పూర్తిగా బెడ్‌కే పరిమితం అయిపోయాను. అప్పుడు నా భర్త నాకు ఆంక్షలు పెట్టేవాడు. అయితే బెడ్ రెస్ట్ తీసుకున్నప్పటికీ పొట్ట కనిపించలేదు. దీంతో చాలా భయపడిపోయాను. ఏమైందో అర్థం కాక టెన్షన్ పడ్డాను. కానీ ఏడు నెలల తర్వాత నా కడుపు పెరిగింది. దీంతో ఊపిరి పీల్చుకున్నాను. ఇద్దరు కవల పిల్లలు పుట్టి నా జీవితంలోకి వెలుగులు తెచ్చారు'' అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: