జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతున్నటువంటి పేరు.గుప్పెడంత మనసు జగతిగా తెలిసిన జ్యోతిరాయ్ ఇమేజ్ వేరు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ట్రోల్స్ కి గురవుతుంది. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ పై జ్యోతిరాయ్ స్పందించారు.జ్యోతిరాయ్ సోషల్ మీడియా హాట్ బాంబుగా అవతరించిన సంగతి తెలిసిందే. తెలుగు ఆడియన్స్ ఆమె తీరుకు అవాక్కు అయ్యారు. సీరియల్ నటిగా ఆమెకున్న ఇమేజ్ రీత్యా ఓవర్ ఎక్స్పోజ్డ్ లుక్ వైరల్ అయ్యింది.  స్టార్ మా సూపర్ హిట్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. ఆ సీరియల్ లో హీరో రోల్ రిషికి తల్లైన జగతి పాత్ర చేసింది జ్యోతిరాయ్. మిడిల్ ఏజ్ హోమ్లీ రోల్ లో జ్యోతిరాయ్ మెస్మరైజ్ చేసింది. ఆమె లుక్ నిజమైన ఒక తల్లిని గుర్తు చేసేది. అనూహ్యంగా జగతి పాత్రను సీరియల్ నుండి తొలగించారు. ఆ పాత్రను చంపేశారు.
 ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎంత చెప్పినా అది తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది.. మరీ ముఖ్యంగా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన జ్యోతి సడన్గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేయడం స్టార్ట్ చేసింది. దీనితో పద్ధతిగా చీర కట్టుకునే జగతి ని చూసిన జనాలు వామ్మో ఏంటిది బరితెగింపు అనే రేంజ్ లో ట్రోల్ చేశారు .

 అంతేకాకుండా సుకుపూర్వ రాజ్ అనే డైరెక్టర్ తో ప్రేమాయణం కొనసాగించి ..పెళ్లి కూడా చేసేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆమెకు పెళ్లయింది.. ఒక బిడ్డ కూడా ఉన్నాడు .. మళ్ళీ ప్రేమ ఏంటి అంటూ జనాలు తిట్టిపోశారు.. అయినా సరే వాటిని పెద్దగా పట్టించుకోలేదు జగతి మేడం.. తాజాగా ఆమె ఓ సినిమాలో నటిస్తుంది .. అది కూడా తన భర్త సుకు పూర్వ రాజ్ దర్శకత్వంలోనే.. ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో నటించింది .ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న జ్యోతి రాయి కు హాట్ ఎక్స్పోజింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.దీంతో చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది . 'సినిమా ఇండస్ట్రీలో ఉన్నాక ఏ పాత్రకు తగ్గ న్యాయం ఆ పాత్రకు చేయాలి. ట్రెడిషనల్ గా కనిపించేటప్పుడు ట్రెడిషనల్ గా కనిపించాలి.. మోడరన్ లుక్స్ లో మెరిసేటప్పుడు మోడరన్ గా ఆకట్టుకోవాలి ..ఎవరో నన్ను ట్రోల్ చేస్తున్నారు అని ..నా వృత్తిని నేను వదులుకోలేను కదా..? ఎవరు ఏమనుకున్నా సరే నా సినిమాలు నావి.. నా కెరియర్ నాది.. నా ఇష్టపూర్వకంగానే నేను సినిమాలో నటిస్తున్నాను.. సినిమాల కోసం ఏమైనా చేస్తాను ' అంటూ చాలా ఘాటుగా బదులిచ్చింది. కొంతమంది జగతి మేడం ఆన్సర్ ని కరెక్ట్ అంటుంటే మరి కొంతమంది పూర్తిగా సినిమా మాయలో పడిపోయింది ఈ జగతి మేడం అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: