టాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు తాజాగా హరోం హార అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను ఈ నెల 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. జ్ఞాన స్వాగత్ ద్వారకా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించగా ... ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ లో సునీల్ , జయ ప్రకాష్ , అక్షర , అర్జున్ గౌడ , లక్కీ లక్ష్మణ్ , రవి కాలే కీలక పాత్రలలో నటించారు.

ఇకపోతే జూన్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా ఈ మూవీ కి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను అంతకన్నా ఒక రోజు ముందు అనగా మే 13 వ తేదీన ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేసారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షో ను ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఏ ఎం బి సినిమాస్ థియేటర్ లో ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా వాటికి జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. దానితోనే అర్థం అవుతుంది ఈ సినిమాలో చాలా రక్త పాత సన్నివేశాలు ఉంటాయి అని. మరి ఈ మూవీ తో సుధీర్ బాబు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb