తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన సినిమాలలో హీరో పాత్రాలలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో , ఎన్నో సినిమాలలో ముఖ్య పాత్రలలో కూడా నటించి తన నటనతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఈయన సైరా నరసింహా రెడ్డి , ఉప్పెన అనే రెండు తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈ మూవీలతో ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. 

ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి "మహారాజ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా జూన్ 14 వ తేదీన తమిళ్ తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం మేకర్స్ ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను తెలుగు రాష్ట్రాల్లో భారీగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రీమియర్ షో స్ ను కూడా ప్రదర్శించబోతున్నారు.

అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో స్ ను ఏ తేదీన , ఏ థియేటర్లలో, ఏ సమయానికి ప్రదర్శించనున్నారు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క ప్రీమియర్ షో స్ ను ఈ రోజు అనగా జూన్ 13 వ తేదీన 7 గంటల 30 నిమిషాలకు ఏ ఏ ఏ సినిమాస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇక ప్రసాధ్స్ థియేటర్లో రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో ను ప్రదర్శించనున్నారు.

ఈ రోజు రాత్రి 10 గంటల 40 నిమిషాలకు ఏ ఎం బి సినిమాస్ లో ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ రోజు రాత్రి 11 గంటలకు ప్రసాధ్స్ థియేటర్లలో ఈ మూవీ కి సంబంధించిన తమిళ్ ప్రీమియర్ షో స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తమిళ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించగా దానికి అద్భుతమైన టాక్ వచ్చినట్లు మేకర్స్ చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs