నాగబాబు తన అన్నయ్య పెద్ద కూతురు సుస్మిత గురించి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. సుస్మితకు మా నాన్న కూడా భయపడేవారు. ఆమె తిడుతుంది అంటూ కీలక విషయాలు బయటపెట్టాడు.సుస్మిత ఇలాంటిదా అని జనాలు వాపోతున్నారు..చిరంజీవి చాలా సౌమ్యుడు. వివాదరహితుడు. ఆయన ఇతరులను కించపరిచి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే చిరంజీవిని పరిశ్రమలో చాలా మంది గౌరవిస్తారు. ఆయన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం ఫైర్ బ్రాండ్స్. తమ కుటుంబం గురించి ఎవరైనా విమర్శలు చేస్తే కౌంటర్లు ఇస్తారు.ఇక చిరంజీవికి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. పెద్దమ్మాయి సుస్మిత, తర్వాత రామ్ చరణ్, శ్రీజ. రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. స్టార్ హీరోగా హవా సాగిస్తున్నాడు.చిన్న కూతురు శ్రీజ విషయంలో చిరంజీవికి షాక్స్ తప్పలేదు. చదువుకునే రోజుల్లోనే ఆమె పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుంది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. ఆయనతో కూడా విడిపోయింది. ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది.చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత గురించి తెలిసింది తక్కువే. అయితే ఆమె ఇండస్ట్రీకి వచ్చాక ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంది. సుస్మిత చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించింది. చిరంజీవి-కళ్యాణ్ కృష్ణ కాంబోలో శ్రీజ ఓ చిత్రం నిర్మించాల్సి ఉండగా అది ఆగిపోయింది.తాజాగా ఆమె పరువు టైటిల్ ఒక వెబ్ సిరీస్ నిర్మించింది. నివేద పేతురాజ్ ప్రధాన పాత్ర చేసింది. పరువు సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగబాబు అన్నయ్య కూతురు సుస్మిత గురించి కీలక కామెంట్స్ చేశారు. ఆమె చాలా స్ట్రిక్ట్, తిడుతుంది. మేమందరం నాన్నకు భయపడేవాళ్ళం, కానీ నాన్న ఆమెకు భయపడేవాడు అన్నాడు.సుస్మిత తన పిల్లలను కూడా చాల క్రమశిక్షణగా పెంచుతుంది. మిలిటరీ రూల్స్. మా పిల్లలను కూడా మేము అంత క్రమశిక్షణతో పెంచలేదు అన్నాడు. ప్రతి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుందని నాగబాబు సుస్మితను ఉద్దేశించి అన్నాడు. ఆమె ఐపీఎస్ అయ్యి ఉంటే తాట తీసేసేది అని నాగబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: