టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాఖీ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రవితేజ ముళ్లపూడి ముళ్ళపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఈ మూవీ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అందులో ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్టాల థియేటర్ హక్కుల తో పాటు కర్ణాటక , తమిళ నాడు రాష్ట్రాల థియేటర్ హక్కులతో కలిపి 8 కోట్లకు నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ లెక్కన ఆసియన్ సురేష్ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై విశ్వక్ తాజాగా చాలా గట్టిగా స్పందించాడు. తాజాగా మెకానిక్ రాఖీ థియేటర్ హక్కుల గురించి వస్తున్న వార్తలపై విశ్వక్ స్పందిస్తూ గాడిద గుడ్డు ఎం కాదు. జీఎస్టీ అంట. టీ షాప్ ముచ్చట్లు తీస్కోచ్చి ట్వీటర్ లో పెట్టొద్దు ప్రియాజీ. మెకానిక్ రాకీ ఇంకా విక్రయించబడలేదు. వాస్తవాలను సరిగ్గా పొందండి. ఇది టీమ్స్ కెరీర్ అంటూ విశ్వక్ తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకోచ్చారు. ఇక విశ్వక్ తాజాగా పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.  మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి జేక్స్ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే తాజాగా విశ్వక్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. మే 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ రేపు అనగా జూన్ 14 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs