.తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సుదీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ రేపు అనగా జూన్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది.

మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ , అడవి శేషు , విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుధీర్ బాబు , మహేష్ బాబు మాట్లాడిన ఒక ఆడియోను విడుదల చేశారు. అందులో భాగంగా సుదీర్ బాబు , మహేష్ బాబు ను ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న లో సినిమాల్లో గన్స్ మొదట వాడినప్పుడు ఎలా అనిపించింది అని ప్రశ్న అడిగాడు. దానికి మహేష్ సమాధానం ఇస్తూ ... నేను సినిమాల్లో గన్స్ వాడేటప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నేను టక్కరి దొంగ సినిమాలో ఎక్కువ శాతం గన్స్ వాడాను అని సమాధానం ఇచ్చారు.

ఇక ఆ తర్వాత సుధీర్ బాబు ఎక్కువ గన్స్ చూపించిన సినిమాలలో మీకు ఏ సినిమా అంటే ఇష్టం అని అడిగాడు. దానికి మహేష్ బాబు సమాధానం ఇస్తూ ... మోసగాళ్లకు మోసగాడు సినిమాలో ఎక్కువ గన్స్ వాడుతారు. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాను దాదాపు 100 సార్లు చూసి ఉంటాను అని మహేష్ సమాధానం ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే హరోం హర సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: