మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ , ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు లో వరుస సినిమాలు నటిస్తోంది అని చాలా మంది అనుకున్నారు. 

కానీ ఈమె మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసి అనేక అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో టాప్ బ్యూటీ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమాలో సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ రోజు ఈ బ్యూటీ పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ యూనిట్ ఈ సినిమా నుండి దిశా పటాని కి సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

ఇందులో ఈమె అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉంది. ఈ సినిమాలో ఆమె రోక్షి గా కనిపిస్తుంది అని తన రోల్ ని కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఇక ప్రస్తుతం దిశ కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే కల్కి సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దుగుమ్మకు కూడా అద్భుతమైన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో , ఈ మూవీ తో ఈ నటికి ఏ రేంజ్ గుర్తింపు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

dp