జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో యమదొంగ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయము అయ్యింది మమత మోహన్ దాస్. ఇకపోతే ఈ సినిమాలో నెల్లూరు అమ్మాయి పాత్రలో అదరగొట్టేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ భాషల్లో  అందరిని మెప్పించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత వరుస సినిమాల్లో చేసే అవకాశాలను దక్కించుకున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది ఈ ముద్దుగుమ్మ. కొన్నాళ్లపాటు క్యాన్సర్ కి సంబంధించిన చికిత్స తీసుకుని ఇప్పుడిప్పుడే

 కోలుకుంది. క్యాన్సర్ తో పోరాటం చేసిన తర్వాత కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చే విశ్రాంతి తీసుకుంది. మళ్లీ తిరిగి గత ఈ ఏడాది  రుద్రంగి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో పాటు ప్రస్తుతం మలయాళం లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కాగా ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా జూన్ 14న విడుదల కాబోతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ఉంది మమత

 మోహన్ దాస్ .ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్న మమతా మోహన్దాస్  ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన పెళ్లి గురించి యాంకర్ అడిగినందుకు షాకింగ్ విషయాన్ని చెప్పింది. అదేంటంటే... “నాకు మలయాళీ చిత్రపరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను పోషించిన పాత్రలకు ప్రశంసలు వచ్చాయి. అందువల్లే తమిళం, తెలుగు భాషల్లో మూవీస్ చేసే అవకాశం వచ్చింది. మలయాళీ ప్రేక్షకులు నాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ వంటి వారు నాపై ప్రశంసలు కురిపించారు” అంటూ చెప్పుకొచ్చింది. గతంలో లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ మా రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. జీవితంలో రిలేషన్ ఉండాలి. దానివల్ల వచ్చే ఒత్తిడిని మాత్రం నేను కోరుకోవడం లేదు. ఒకరి తోడు కచ్చితంగా కావాలని మాత్రం అనుకోవడం లేదు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు... అంటూ చెప్పుకొచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: