పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చేసిన మొదటి సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీగా గుర్తింపును సంపాదించుకుంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ తన నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇందులో తన నటన తన డాన్స్ అందం చందంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తనకి వరుస అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన ప్రతి

 అవకాశాన్ని యూస్ చేసుకుంటూ అన్ని సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ సినిమా ఊహించిన విధంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అలా ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా తర్వాత తనకి వరుస సినిమాల్లో నటించే అవకాశం దొరికింది. అలా వరుస సినిమాల్లో చేసి ఫ్లాగ్స్ అందుకుంది శ్రీల చేసిన అన్ని సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ధమాక అంత  విజయాన్ని

 సాధించలేకపోయింది.  తాజాగా ఇప్పుడు రవితేజ చేస్తున్న తన 75వ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి హాజరయ్యింది. అయితే ఈ ఈవెంట్ లో నారింజరంగు చీరలో అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్ అనిత డోంగ్రి డిజైన్ చేసిన ఈ చీర లో చాలా హాట్ గా కనిపించింది.  మంచి  ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఈ చీరలో చాలా అందంగా కనిపించింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ చీర ధర నెట్టింట వైరల్ అవుతుంది. అయితే శ్రీ లీల కట్టుకున్న ఆ చీర ఖరీదు 70 వేలకు పైగానే ఉంటుంది అని తెలుస్తోంది. ఈ చీర ధర అందరూ షాక్ అవుతున్నారు. అంత సింపుల్గా ఉన్న చీర అంత రేటు అంటూ షాక్ అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: