గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు త్వరలోనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపుగా 600 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో వస్తున్న  ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ ఇప్పటికే విడుదల చేయగా సోషల్ మీడియా వేదికగా విశేషమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇకపోతే కల్కి ట్రైలర్ అన్ని భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత ఇందులో కొన్ని మైనర్ మైనస్ లో ఉన్నాయి అని చాలామంది కామెంట్లు చేస్తున్నప్పటికీ అవి పెద్దగా సినిమాపై ప్రభావం చూపవు. ఇకపోతే కల్కి ట్రైలర్ చూసుకుంటే.. ఇందులో కమలహాసన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ట్రైలర్లో ఆయన పాత్ర చాలా గంభీరంగా ఉంది. ఆయన వాయిస్ సైతం చాలా గంభీరంగా ఉంది. ఎప్పుడూ చూడని పాత్రలో ఇందులో కమలహాసన్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రైలర్లో ఆయన ముఖం మొత్తం చూపించినప్పటికీ కాస్త చూపించడంతో అది

 కూడా చాలా భయంకరంగా ఉంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. ఈ సినిమా నుండి రెండు ట్రైలర్స్ వస్తాయట. మొదటి ట్రైలర్ ఇప్పటికే విడుదల చేయగా సెకండ్ ట్రైలర్ త్వరలోనే రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది అని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేస్తున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా 27వ తేదీన గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: