అందాల ముద్దుగుమ్మ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజీయేస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఆఖరుగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అప్పటి నుండి మరియు గుంటూరు కారం సినిమా వరకు కూడా చాలా సన్నగా కనిపించేది. దానితో ఈ అమ్మాయికి వయసు తక్కువ ఉన్నప్పటికీ మరీ చిన్న పిల్లల కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ నటి రవితేజ హీరో గా రూపొందిపోయే 75 వ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు శ్రీ లీలా కూడా వచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీపూజా కార్యక్రమాలకు వచ్చి కొన్ని ఫోటోలు కూడా దిగింది. అందులో ఈమె కాస్త బొద్దుగా కనిపిస్తోంది. దానితో మొన్నటి వరకు సన్నగా ఉన్న ఈ బ్యూటీ ఏంటి ఇంత లావు అయ్యింది అని ఈమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఈ మధ్య కాలంలో వరుస సినిమా షూటింగ్ లు లేకపోవడంతో ఈమె బొద్దు అయి ఉంటుంది. మళ్లీ సన్న బడుతుంది అని కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: