మోస్ట్ బ్యూటిఫుల్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో వరలక్ష్మి కి మంచి సినిమా అవకాశాలు లభించడం , అందులో భాగంగా ఈమె నటించిన సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడంతో ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఇకపోతే ఈమె నటించిన తెలుగు సినిమాలలో క్రాక్ , వీర సింహా రెడ్డి సినిమాలలోని ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

ఈ రెండు సినిమాలకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఎక్కువ శాతం తెలుగులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఈ బ్యూటీ ఆకట్టుకుంది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఇక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈమెకి కొంత కాలం క్రితం నికోలై సచ్ దేవ్ తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా వీరి పెళ్లి ముహూర్తం కూడా డిసైడ్ అయ్యింది. వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగబోతుంది. ఇకపోతే జూలై 2 వ తేదీన థాయిలాండ్ లో వేరే వివాహం జరగబోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తల్లి దండ్రులు అయినటువంటి శరత్ కుమార్ , రాధిక ఇప్పటికే వీరిద్దరి పెళ్లి పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ ఈమె పెళ్లిని ఎంతో ఘనంగా చేయడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ , సహా కొంత మంది సీని , రాజకీయ ప్రముఖులను కూడా స్వయంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరి వరలక్ష్మి శరత్ కుమార్ వ్యవహానికి భారీ ఎత్తున సినీ మరియు రాజకీయ ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈమె పెళ్లికి ఎంత మంది ప్రముఖులు వస్తారో ... ఈమె పెళ్లి ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vsk