తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ కెరీర్ లో 75 వ మూవీ గా రూపొందబోయే సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే.  శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుండగా భాను భోగావరపు దర్శకత్వం వహించబోతున్నాడు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. విధు అయ్యన సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించనున్న ఈ మూవీ కి నవీన్ నోలి ఎడిటర్ గా పని చేయనున్నాడు.

సీతారా ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి కచ్చితంగా ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయాలి అనే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే రవితేజ ఆఖరుగా ఈగల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చాలా రోజుల నుండి ప్రకటిస్తూ వచ్చారు. తీరా సంక్రాంతి వచ్చాక ఈ మూవీ ని పోస్ట్ ఫోన్ చేసి ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు. మరి పోయిన సారి సంక్రాంతి కి రవితేజ సినిమా రాబోతుంది అని ఆయన అభిమానులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సారి కూడా సంక్రాంతి కి రవితేజ మూవీ ని తీసుకురావాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారి అయినా రవితేజ మూవీ సంక్రాంతి కి వస్తుందా.. లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: