నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే . ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఈ సినిమా విడుదల అయిన కొంతకాలానికే ఈ సినిమా హీరో అయినటువంటి బాలకృష్ణ , దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను ఇద్దరు కూడా అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 ఉండబోతుంది అని అధికారికంగా ప్రకటించారు.

ఆ తర్వాత స్కంద మూవీ తెరకెక్కించిన బోయపాటిమూవీ పనులు పూర్తి కాగానే అఖండ 2 స్క్రిప్ట్ పనిలో బిజీ అయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే ఆ మూవీ కి సంబంధించిన కథ మొత్తాన్ని పూర్తి చేసినట్లు ఆయన చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ , బోయపాటి కాంబోలో మరో మూవీ రాబోతుంది అని అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఇది అఖండ 2 అని సమాచారం. ఈ మూవీ ని 14 రింగ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ గారు నిర్మించబోతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అఖండ 2 కోసం బాలయ్య అదిరిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అఖండ 2 సినిమా కోసం బాలయ్య ఏకంగా 34 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో కావడం , అలాగే అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న మూవీ కావడంతో బాలయ్య కు ఈ స్థాయిలో రెమ్యూనిరేషన్ ను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: