పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా తో బిజిగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం పుష్ప టు సినిమాతో బిజీగా

 ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా విడుదల కూడా దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించిన అన్ని పనులను సమకూర్చుకుంటున్నారు చిత్రబంధం. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే.. తాజాగా ఏపీ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా చిరంజీవి

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ వచ్చారు. అయితే వీళ్ళిద్దరితోపాటు ఎన్టీఆర్ బన్నీలకి కూడా ప్రత్యేక ఆహ్వానం అందినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఆహ్వానం అంది ఉంటే ఖచ్చితంగా నిన్న జరిగిన వేడుకల్లో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉండేవారు. అయితే ఎప్పటినుండో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీకి సపోర్ట్ చేయలేదు. టిడిపి పార్టీకి ఎప్పుడు కూడా అనుకూలంగా వ్యవహరించలేదు. ఆ పార్టీని పట్టించుకోకుండా ఎప్పుడు సినిమాల పైన ఫోకస్ చేస్తూ ఉండేవారు. అలా వీళ్ళిద్దరికీ ఆహ్వానం అంది ఉండకపోవచ్చు అంటూ ఈ వార్త తెలిసిన తర్వాత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ విషయంలో నిజ నిజాలు ఏంటి అన్నది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: