ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన మృణాల్ ఠాగూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈమె. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. అలా సడన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈమే. అందులో

 భాగంగానే తన కెరీర్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంది. ఇక అసలు విషయం ఏంటంటే.. సీతారామం సినిమాతో ప్రేక్షకుల్లో భారీగా గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరి మనసులను దోచుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా అయ్యింది 2012లో వచ్చిన ముజే కుచ్ కహతి ఏ కామోషన్ అని హిందీ సీరియల్ ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కుంకుమ భాగ్య అనే సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు మరాఠీ సినిమాలు హిందీ సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో సీతారామన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న

 సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడవసారి రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ అని సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు ఈ బ్యూటీ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేంటంటే... "నేను నటిగా ఎదగాలి అని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం విధి నన్ను ఈ డైరెక్షన్‌లో నడిపించింది. అందుకే నేను డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా చేశానేమో.. అక్కడే నాకు నటన పట్ల ఉన్న అభిరుచిని నేను తెలుసుకోగలిగాను. ఆ తర్వాత ఆడిషన్స్ నాకు నటనపై మరింత ఆసక్తిని పెంచాయి. నా స్నేహితులు కూడా నేను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అని ప్రోత్సహించేవారు." అంటూ మృణాల్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణాన్ని చెప్పింది

మరింత సమాచారం తెలుసుకోండి: