పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో సెకండ్ హీరోయిన్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది సంయుక్త. మొదటి సినిమాతోనే తన నటనకు మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సాయి ధరం తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష వంటి సినిమాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంది. ఆ సినిమాల తరువాత ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో హీరోయిన్గా నటించిన... ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని

 అందుకోవడంతో తనకి గోల్డెన్ హీరోయిన్ గోల్డెన్ లెగ్ అన్న పేరు సైతం వచ్చింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది సంయుక్త మీనన్. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తనకి సంబంధించిన అందమైన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా సంయుక్త  తన అందమైన క్షణాలను మిస్ అవుతున్నాను అంటూ తన స్కూల్ డేస్ కి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసింది. దాంతో సంయుక్త మీనన్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే పాఠశాలలో

 చదువుతున్న రోజుల్లో సంయుక్త స్కూల్‌ టాపర్ అట. ఇక విషయం తెలిసి మా హీరోయిన్ మల్టీ టాలెంటెడ్ అని కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. అయితే చివరిగా ఈమె కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో కనిపించింది సంయుక్త. ఇటీవల వచ్చి లవ్ మీ చిత్రంలో కామియో రోల్ చేసింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ లో నటిస్తుంది. ఈ కోసం సంయుక్త స్వయంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. అటు మలయాళం, తమిళ ఇండస్ట్రీలలో కూడా అడపా దడపా లు చేస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: