నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రగ్యా జైస్వాల్ విజయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో భాగంగానే ఈ సినిమా తర్వాత తనకి వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా తనకి ఆఫర్స్ మాత్రం రాలేదు. అఖండ సినిమా తర్వాత కేవలం సన్ ఆఫ్ ఇండియా సినిమాలో మాత్రమే కనిపించిన ఈ బ్యూటీ హిందీలో సల్మాన్ ఖాన్ తో ఒక మ్యూజిక్ వీడియో చేసింది. ఇక అది తన కెరీర్ కి అంతగా

 ఉపయోగపడలేదు. సినిమాల పరంగా హిట్ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ హీరో తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నట్లు గా వార్తలు వినబడుతున్నాయి. అయితే గత రెండేళ్లుగా రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న ఈ బ్యూటీ ఓ లక్కీ ఛాన్స్‌ను సొంతం చేసుకున్నది. బాలీవుడ్ మూవీలో అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్ చేయబోతున్నది. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే పేరుతో కామెడీ డ్రామా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో అక్షయ్

 కుమార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తోన్నారు. తాప్సీ, వాణికపూర్‌తోపాటు ప్రగ్యాజైస్వాల్ మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నది. ఈ మూవీలో ప్రగ్యాజైస్వాల్ నటిస్తోన్న విషయాన్ని చిత్ర యూనిట్ ఆఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఖేల్ ఖేల్ మే మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప 2కు పోటీగా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. అదే రోజు బాలీవుడ్‌లో జాన్ అబ్రహం వేదా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2015లో బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించిన మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యాజైస్వాల్‌. పదేళ్లలో కంచె, అఖండ మినహా ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: