ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. ఇక ఈ సినిమా కోసం గ్లోబల్ వైడ్ గా ఉన్న సినీ ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దానికి సీక్వల్ గా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన హీరోయిన్గా కనిపించబోతోంది. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి

 సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేసి త్వరలోనే ప్రమోషన్స్ కూడా జరిపేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పనిచేస్తున్నారు. తాజాగా పుష్ప ది రూల్ షూటింగ్

 అప్‌డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ టాక్‌ ప్రకారం జూన్‌ 13 నుంచి షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది. ఈ అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పుష్ప ఫస్ట్‌ సింగిల్‌ పుష్ప పుష్ప నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మరోవైపు ఇటీవలే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో లాంఛ్ చేసిన పుష్ప సెకండ్ సింగిల్ సూసేకి Sooseki మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: