జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

మూవీ యొక్క పనులు అక్టోబర్ 10 వ తేదీ కంటే చాలా రోజుల ముందే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ని అక్టోబర్ 10 వ తేదీ కంటే ముందు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులై ఉన్న ఈ మూవీ కి ఉన్న డిమాండ్ నిమిత్తం అనేక మంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా యొక్క థియేటర్ హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈయన ఈ సినిమాను నైజాం ఏరియాలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ లాంటి బారి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ కావడం జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ , కొరటాల కాంబోలో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: