టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మికతక్కువ కాలంలోనే స్టార్‌ నటిగా ఎదిగిన రష్మిక పలు అవార్డు కూడా అందుకుంది. తనదైన నటనతో నాలుగు సైమా అవార్డులు  ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌తో పాటు మరిన్ని పురస్కారాలు అందుకుంది.రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. చలో నుంచి పుష్ప సినిమా వరకు తన సినీ ప్రయాణం గురించి అందరికీ తెలుసు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలలో పుష్ప సినిమా ఎక్కువ క్రేజ్ ను అందించింది.. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమాతో నేషనల్ క్రష్ అయ్యింది.. తెలుగు పాటు, బాలీవుడ్ లో కూడా సత్తాను చాటుతుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా చేతినిండా లతో దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది.ప్రస్తుతం ఈ మూవీ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అటు వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్న రష్మిక.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్, ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది. అలాగే కొన్నిసార్లు నెట్టింట అభిమానుల పోస్టులకు రిప్లై ఇస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్టుకు ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది రష్మిక. ఇటీవల యానిమల్ లో గీతాంజలి పాత్రలో తనదైన నటనతో ప్రశంసలు అందుకుంది రష్మిక.

బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.900 కోట్లు రాబట్టిన ఈ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రణబీర పాత్రపై ఆగ్రహం చూపించారు. ఇందులో స్త్రీలను తక్కువ చేసి చూపించారని ఆరోపణలు వచ్చాయి. కానీ రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే.. ఈ లో రణబీర్ తన భార్య గీతాంజలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆమెను జోయాను ప్రేమిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ 'గుర్తుంచుకోండి. మనిషిని నమ్మడం కంటే భయంకరమైనది ఏదీ లేదు' అంటూ యూజర్ క్యాప్షన్ ఇచ్చారు.ఇక పోస్టుపై రష్మిక స్పందిస్తూ.. 'కరెక్షన్.. స్టుపిడ్ ను నమ్మితే భయంకరం. చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు. వారిని నమ్మడం కూడా ప్రత్యేకమే' అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక కామెంట్ నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే రష్మిక నటిస్తున్న పుష్ప 2 చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: