ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీ లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలల్ నటించారు.

మూవీ 2021 డిసెంబర్ 17 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ మూవీ కి మరీ ముఖ్యంగా నార్త్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలను , ప్రచార చిత్రాలను వరుసగా విడుదల చేస్తూ ఉండడంతో ఈ మూవీ ని కచ్చితంగా ఆగస్టు 15 వ తేదీన విడుదల చేస్తారు అని అంతా భావించారు. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసి ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ కూడా డిసెంబర్ నెలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఇక పుష్ప పార్ట్ 2 మూవీ ని కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa