మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ ప్రస్తుతం అడవి శేష్ హీరోగా రూపొందుతున్న డెకాయిట్‌ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. కాకపోతే అడవి శేషు ఈ మూవీ తో పాటు గూడచారి 2 సినిమాలో కూడా హీరోగా నటిస్తూ ఉండడంతో ఏకకాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్ లు చేస్తూ ఉండడం వల్ల కొన్ని రోజుల పాటు గూడచారి 2 సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. 

దానితో ఈ మూవీ షూటింగ్ ఇన్ని రోజుల పాటు స్పీడుగా జరగలేదు. ఇకపోతే శేషు ఇప్పుడు డెకాయిట్‌ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా యొక్క షూటింగ్ రీ స్టార్ట్ అయింది. ఈ మూవీ ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతుంది. ఇకపోతే ఈ షెడ్యూల్ లో అడవి శేషు తో పాటు ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించనున్న శృతి హాసన్ కూడా పాల్గొంది. తాజాగా అడవి శేషు , శృతి హాసన్ కలిసి ఉన్న ఒక ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో అవుతుంది.

మూవీ నుండి కొన్ని రోజుల క్రితం ఒక వీడియోను విడుదల చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. శృతి హాసన్ పోయిన సంవత్సరం వీర సింహా రెడ్డి , వాల్టేర్ వీరయ్య , హాయ్ నాన్న , సలార్ నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి నాలుగు మూవీలలో మంచి విజయాలను అందుకుంది. ఇక అడివి శేషు కూడా ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరి ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న డెకాయిట్‌ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: