పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో కొంతకాలం క్రితం ఓజి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా , దానయ్య ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదట ఫుల్ స్పీడ్ గా జరిగింది. దానితో ఈ సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ తేదీని మేకర్స్ ఫిక్స్ చేసుకోవడంతో పవన్ అభిమానులు చాలా ఆనందపడ్డారు. ఎందుకు అంటే ఈ సినిమా విడుదల అయిన తర్వాత దాదాపు పది రోజుల్లో అనేక హాలిడేస్ ఉన్నాయి. దాని వల్ల మంచి టాక్ కనుక సినిమాకు వచ్చినట్లు అయితే భారీ స్థాయిలో ఈ మూవీ కి కలెక్షన్లు వస్తాయి అని వారంతా ఆనందపడ్డారు. కానీ వీరి ఆశలు అన్ని నీరుగారిపోయాయి. ఎందుకు అంటే ఓజి సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే పవన్ రాజకీయ పనులతో బిజీ అయ్యారు. దానితో ఓజి సినిమా పనులు పూర్తి కాలేదు. ఇక సెప్టెంబర్ 17 వ తేదీన ఈ మూవీ విడుదల కావడం కష్టమే అనే వార్తలు బయటకు రావడంతో చాలా మంది ఆ తేదీ పై కన్నువేశారు.

అందులో భాగంగా ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ అంచనాలు కలిగిన దేవర సినిమాను మొదట అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సెప్టెంబర్ 27 వ తేదీన ఓజి రావట్లేదు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కావడంతో వారు కూడా ఇదే తేదీన దేవర సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా అనేక మంది మేకర్స్ సెప్టెంబర్ 27 వ తేదీ పై కన్ను వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: