సందీప్ స‌రోజ్ , య‌శ్వంత్ పెండ్యాల‌ , ఈశ్వ‌ర్ ర‌చిరాజు , త్రినాథ్ వ‌ర్మ , ప్ర‌సాద్ బెహ‌ర‌ , మ‌ణికంఠ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో కమిటీ కుర్రాళ్ళు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న చిత్రం నుండి ఇప్పటికి అనేక ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

దానితో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని సమయాన్ని ప్రకటించారు. ఈ మూవీ టీజర్ ను ఈ రోజు అనగా జూన్ 14 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ యొక్క టీజర్ ను యంగ్ హీరో నితిన్ చేతుల మీదుగా రిలీజ్ కానుంది. ఈ మేర‌కు ఈ  మూవీ యూనిట్ ఓ పోస్ట‌ర్ తో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఇక ఈ మూవీ బృందం వారు తమకు సపోర్ట్ చేయడానికి తమ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసేందుకు ఒప్పుకున్న నితిన్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఈ మూవీ టీజర్ ను నితిన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా టీజర్ కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి నిహారిక కొనీదల నిర్మాతగా ఈ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: