మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వం లో రూపొందుతున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండ గా , సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ నీ నిర్మిస్తున్నాడు . జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఏ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేయనున్నారు . తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. నిన్న అనగా జూన్ 13 వ తేదీన ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నటువంటి జీ వి ప్రకాష్ కుమార్ పుట్టిన రోజు కావడం తో ఈ మూవీ బృందం లక్కీ భాస్కర్ మూవీ లోని మొదటి పాటను ఈ నెల 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే దుల్కర్ తెలుగులో నటించిన మహానటి , సీత రామం రెండు సినిమాలు విజయాలు సాధించడం ,  సార్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సైనా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: