సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా కూడా చేశాడు.ఇందులో కొన్ని మంచి విజయాలు కూడా సాధించాయి. అయితే సినిమాలు చేస్తున్న సమయంలో బుల్లితెర వైపు ప్రత్యేక దృష్టి పెట్టని సుధీర్ ఇటీవల మాత్రం పలు షోలకి హోస్ట్‌గా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతంలో యాంకర్ ప్రదీప్ చేసిన సర్కార్ గేమ్ షో కి సుధీర్ హోస్ట్ గా ఉన్నారు. సర్కార్ సీజన్ 4 ఆహా లో స్ట్రీమ్ అవుతుండగా… సుధీర్ దుమ్మురేపుతున్నాడు. మరోవైపు ఈటీవీ లో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో సరికొత్త గేమ్ షో స్టార్ట్ చేశాడు. ప్రతి ఎపిసోడ్ కి కొందరు సెలెబ్స్ ని ఆహ్వానించి వారితో సరదా గేమ్స్ ఆడిస్తూ తెగ సందడి చేస్తున్నాడు.అయితే సుడిగాలి సుధీర్ మార్క్ పంచులు, సెటైర్స్ గేమ్ షో ప్రతి ఒక్కరికి నవ్వులు పంచుతుంది. ఇక తాజా ఎపిసోడ్‌కి పంచ్ ప్రసాద్, యాదమ్మ రాజు, విశ్వా తో పాటు మరికొందరు భార్యలతో వచ్చారు. యాంకర్ స్రవంతి, నటి భాను కూడా ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు. భార్య భర్తల మధ్య గొడవలు చూసి పెళ్లి చేసుకుంటే ఇంత నరకమా… అని సుధీర్ అన్నాడు. మేము అలా చేయము బావా… అని స్రవంతి అన్నది. వాళ్ళు కూడా ముందు ఇదే అన్నారని సుధీర్ భార్యలపై సెటైర్ వేశాడు. ఇక సుడిగాలి సుధీర్ పై పంచ్ ప్రసాద్ వేసిన జోక్స్ బాగా పేలాయి.భార్య భర్తల మధ్య బిందిలో నుండి ఉంగరం తీసే పోటీ పెట్టాడు. మొదట పంచ్ ప్రసాద్ తన భార్యతో ఈ గేమ్ ఆడాడు. మీ పెళ్ళిలో ఉంగరం ఫస్ట్ ఎవరు తీశారు? అని సుధీర్ అడగగా, పంతులు తీశాడని పంచ్ ప్రసాద్ జోక్ వేశాడు. ఇక సుడిగాలి సుధీర్ ని ఉద్దేశించి యాంకర్ స్రవంతి… బావా మనం కూడా చేద్దాం, అని రొమాంటిక్ గా అన్నది. దానికి నువ్వు వినవు. ప్యాకప్ చెప్పాక నువ్వు నన్ను కలవవు, అని సుధీర్ అన్నాడు. పెళ్ళైన స్రవంతితో సుడిగాలి సుధీర్ డబుల్ మీనింగ్ జోక్స్ వేయడంతో అందరు అవాక్కయ్యారు. మొత్తానికి మనోడు ప్లేబాయ్‌గా డబుల్ మీనింగ్ డైలాగులతో నాన రచ్చ చేస్తూ ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: