జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక ఈ సినిమా రజనీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. అందులో భాగంగానే తలైవా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు జై భీమ్ సేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ అనే సినిమా సైతం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రజనీకాంత్ కెరియర్ లో 170 సినిమాగా రాబోతోంది. ఇకపోతే ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ తో

 పాటు అమితాబచ్చన్ రానా రితిక సింగ్ వంటి వారందరూ పలు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ లో విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే  ఈ సినిమాతో పాటు రజనీకాంత్ చేస్తున్న మరొక సినిమా కూలీ. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరక్కెక్కుతోంది. దాంతో ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. .

ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. శృతిహాసన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇప్పుడు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ను తీసుకోనున్నట్లు సమాచారం. ఫహాద్ ఇప్పటికే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన విక్రమ్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించాడు .ఇప్పుడు రజనీకాంత్ కూలీ మూవీలో కూడా ఫహాద్ ని లోకేష్ పవర్ఫుల్ పాత్రలో చూపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జులై చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వార్త సోషల్ మీడియా వేదికగా వైరన్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: