బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే చాలా తెలుగు సినిమాలలో కూడా నటించింది. అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని తెలుగు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి ఎక్కువ శాతం హిందీ సినిమాలలోని నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీనియర్ నటి అయినప్పటికీ ఇప్పటికీ కూడా సినిమాలలో వరుసగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

ఒకప్పుడు సినిమాలలో భారీగా అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలం లో సినిమాలలో ఆ స్థాయిలో అందాలను ఆరబోయిపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అందాలను భారీగానే ఆరబోస్తోంది . అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండగా అవి వైరల్ కూడా అవుతున్నాయి. 

ఇకపోతే కాసేపు శిల్ప సినిమాల విషయం పక్కన పెడితే ... తాజాగా శిల్ప మరియు ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేయాలి అని ముంబై అదనపు సెషన్స్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గోల్డ్ స్కాం పేరుతో తనను మోసగించారని ఓ వ్యాపారి కోర్టులో ఫిర్యాదు చేశారు. సత్ యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్స్ శిల్ప , రాజ్ కుంద్రా తో పాటు ఆ సంస్థ డైరెక్టర్లు , మరో ఉద్యోగి మోసం చేశారు అని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్షాధారాలను జడ్జికి చూపించడంతో కేసు నమోదుకు ఆదేశించారు. మరి ఈ కేస్ ఎంత దూరం వెళుతుందో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: