టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ శిల్పా శెట్టి.. ముఖ్యంగా ఈమె భర్త వల్ల కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. తాజాగా శిల్పాశెట్టి పైన ఒక కేసు నమోదు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా గోల్డ్ స్కీమ్ బోగస్ బంగారు పథకం పేరుతో తనను మోసగించారంటూ ఒక వ్యాపారి శిల్పా శెట్టితో పాటు ఆమె భర్త అయిన రాజ్ కుంద్రా పైన అలాగే వీరితో పాటు మరి కొంతమంది పైన కూడా పృథ్వీరాజ్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.


అంతేకాకుండా తన దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయని అవన్నీ కూడా నిజాన్ని నిరూపిస్తాయని కూడా దర్యాప్తు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు కూడా ఈ విషయాన్ని పరిశీలించి నిజాన్ని నిరూపించాలని ఆదేశాలను జారీ చేసిందట.వారి తప్పు ఉన్నట్లు అయితే ఇండియన్ పినాకిల్ కోడ్ సెక్షన్ కింద వీరి పైన కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు సూచించింది. అయితే వీటి పైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ఫ్యాన్స్ శిల్పా శెట్టికి అండగా నిలబడడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


అసలు విషయంలోకి వెళ్తే సచిన్ జోషి అనే వ్యక్తి దగ్గర 2014లో గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ లో చేరారట. ఐదేళ్ల తర్వాత కాలపరిమితి పూర్తి కావడంతో ఆ బంగారని రీడింగ్ చేసుకునేందుకు ముంబైకి వెళ్లగా అక్కడ క్లోజ్ బోర్డ్ పెట్టడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని కంపెనీ గురించి విచారిస్తే శిల్పా శెట్టి రాజ్ కుంద్రాలకు సంబంధించిన వారు రాజీనామా చేసి వెళ్లిపోయారని తెలిసిందట. దీంతో తాను మోసపోయినట్లు నిర్ధారించుకున్నట్లు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడట  పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరి ఇందుకు  సంబంధించి నిజా నిజాలు ఏంటో తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం అయితే ఈ విషయం టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: