టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సంతోష్ శోబాన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో ఏక్ మినీ ఖాతా మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాకపోతే ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ నటుడు వరుసగా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నా అందులో ఏ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడం లేదు.

ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితం కళ్యాణం కమనీయం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి ప్రియ భవాని శంకర్ హీరోయిన్ నటించగా ... అనిల్ కుమార్ అల్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన సీజన్ లో ఓ పక్క బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి , మరో పక్క చిరంజీవి హీరో గా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమాలు కూడా విడుదల కావడంతో ఈ మూవీ ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావం చూపలేదు. ఆ తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే ఈ మూవీ ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి సంవత్సరం అవుతున్న బుల్లి తెరపై ప్రసారం కాలేదు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: