మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , బింబిసరా ఫేమ్ మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా , యూ వీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన కొంత కాలానికి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు
 


ఇకపోతే ఈ సినిమాలో ఎంతో మంది నటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఆశికా రంగనాథ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో మరో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మూవీ లో కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేస్తారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ కావడం బింబిసర అలాంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి మెగా అభిమానుల్లో మాత్రమే కాకుండా మామూలు తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: