టాలీవుడ్ యువ నాయకుడు శర్వానంద్ హీరో గా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే చిత్రం తాజాగా రూపొందిన విషయం మనకు తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఆ వరం రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి 7 రోజుల్లో నైజాం ఏరియాలో 2.57 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 63 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.76 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.96 కోట్ల షేర్ ... 11.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 7 రోజుల్లో 50 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 95 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 7  రోజుల్లో 7.41 కోట్ల షేర్ ... 14.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 2.59 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: