సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . రజిని పోయిన సంవత్సరం జైలర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన మోహన్ లాల్ , కన్నడ సిని పరిశ్రమలో సూపర్ ఇమేజ్ కలిగిన శివ రాజ్ కుమార్ కీలక పాత్రలలో నటించారు .

ఇక రజనీ కాంత్ తో పాటు వీరు కూడా ఈ మూవీ లో ఉండడంతో ఈ సినిమాకు వీరు అదనపు ఆకర్షణగా నిలిచారు . ఇకపోతే ప్రస్తుతం రజిని "జై భీమ్" మూవీ దర్శకుడు అయినటువంటి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న  వెట్టయన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ , మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న ఫహద్ ఫాజిల్ , తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దగ్గుపాటి రానా ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

మూవీ తో పాటు ప్రస్తుతం రజనీ కాంత్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన శివ కార్తికేయన్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా , మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ఫాహధ్ ఫజిల్ ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో రజనీ నటిస్తున్న సినిమాలలో చాలా మంది స్టార్ నటులు కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: