తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశీష్ రెడ్డి "రౌడీ బాయ్స్" అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటుడు లవ్ మీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అర్జున్ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా మే 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇక థియేటర్ లలో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ మొదటి మూడు రోజులు పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను వసూలు చేసిన ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ధారణంగా పడిపోయాయి. దానితో ఈ మూవీ తో ఆశిష్ కి బాక్స్ ఆఫీస్ నిరాశే మిగిలింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి అమెజాన్ సంస్థ వారు తమ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కి ఓ టి టి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: