.సీరియల్ నటి అయిన లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ట్రై యాంగిల్ ట్రాజిక్ లవ్ డ్రామాగా అందాల రాక్షసి తెరకెక్కింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు.. పెళ్ళి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్న లావణ్య త్రిపాఠికి మరో పెళ్లి ప్రపోజల్ రావడం సంచలనంగా మారింది. ఈ ప్రపోజల్ పై స్పందించిన మెగా కోడలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.యూపీ భామ లావణ్య త్రిపాఠి ఏళ్ల తరబడి హీరో వరుణ్ తేజ్ తో రహస్య ప్రేమాయణం నడిపింది. మిస్టర్ చిత్రంలో మొదటిసారి వీరు కలిసి నటించారు. అనంతరం మరో చిత్రంలో జతకట్టారు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే తమ బంధం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.కొన్ని విషయాలు ఎంత దాచినా దాగవు. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. త్వరలో పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను లావణ్య త్రిపాఠి కొట్టిపారేసింది. సడన్ గా గత ఏడాది వరుణ్ తేజ్-లావణ్య నిశ్చితార్థం ప్రకటన చేశారు. నవంబర్ లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.కొత్త జంట తమ మ్యారీడ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తూ విహరిస్తున్నారు. వీరి చక్కని సంసారంలో చిన్న డిస్ట్రబెన్స్ చోటు చేసుకుంది. లావణ్య ప్రమాదానికి గురైంది. ఆమె కాలికి గాయమైంది. దాంతో చికిత్స తీసుకుంటుంది. ఇంటికే పరిమితం అవుతుంది.

 ఖాళీగా ఉన్న లావణ్య ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేసింది. అభిమానులు అడిగే పలు ప్రశ్నలు సమాధానం చెప్పింది. ఈ క్రమంలో ఆమెకు ఒక అభిమాని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. లావణ్య గారు మీరంటే చాలా ఇష్టం. ఈ జన్మలో వేరొకరిని పెళ్లి చేసుకున్నారు. కనీసం వచ్చే జన్మలో అయినా మనం పెళ్లి చేసుకుందాం... అని కామెంట్ పెట్టాడు.ఈ కామెంట్ పై స్పందించిన లావణ్య త్రిపాఠి... హిందూ శాస్త్రం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి. అలాగే ఈ జన్మకే కాదు జన్మజన్మల నా భర్త వరుణ్ తేజ్ మాత్రమే... అని సమాధానం ఇచ్చింది. లావణ్య స్పందించిన తీరుకు నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు భర్త వరుణ్ అంటే ఎంత ప్రేమో ఈ సమాధానం ద్వారా తెలుస్తుందని అంటున్నారు.మరొక అభిమాని... మీరు నటించిన చిత్రాల్లో అతి కష్టం అనిపించింది ఏది? అని అడిగాడు. నా మొదటి సినిమా అని చెప్పాలి. అప్పుడు క్యారవాన్ కూడా లేదు. స్టైర్స్ నుండి పడిపోయాను. మేకప్ లేదు, హెయిర్ మెయింటెనెన్స్ లేదు. అయితే ఆ పాత్ర చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను, అని లావణ్య అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: