ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించి వాటితో ఎన్నో విజయాలను అందుకున్నాడు. అలాగే ప్రస్తుతం ఎన్నో సినిమాలను ఈయన నిర్మిస్తున్నాడు. నాగ వంశీ ప్రస్తుతం సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మూవీని నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ మూవీని మొదట సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఆ సినిమా ఆల్మోస్ట్ ఆ తేదీన విడుదల కాదు అని వార్తలు రావడంతో నాగ వంశీ తాను ప్రస్తుతం నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా విడుదలకు అన్ని పనులు సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో  కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీని కూడా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో నాగ వంశ కి కొత్త టెన్షన్ మొదలు అయింది. ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ , నాగ వంశీ మంచి స్నేహితులు.

అలాగే దేవర మూవీపై అద్భుతమైన అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. దానితో పోలిస్తే లక్కీ భాస్కర్ పై అంత అంచనాలు లేవు. ఒక వేళ దేవర మూవీ తో పోటీగా లక్కీ భాస్కర్ ను విడుదల చేసిన లక్కీ భాస్కర్ మూవీ కే నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దేవర కు కనక బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్లు అయితే లక్కీ భాస్కర్ మూవీ చాలా తక్కువ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది. దానితో దేవర విడుదల తేదీ నాగ వంశీ కి కొత్త టెన్షన్ ను తెచ్చి పెట్టింది అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. మరి నాగ వంశీ ,  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర కు పోటీగా లక్కీ భాస్కర్ ను విడుదల చేస్తాడా..? లేక దేవర మూవీ కోసం లక్కీ భాస్కర్ విడుదల తేదీన మారుస్తాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: