తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. సినీ పరిశ్రమలో సింగర్ గా కెరియర్ ను మొదలు పెట్టి అందులో మంచి సక్సెస్ అయిన తర్వాత సినిమాల్లో ఈ బ్యూటీ అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈమె అనేక తెలుగు సినిమాలలో కూడా నటించింది. ఈమె యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది.

ఈ సినిమాతో మమతా కి ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ కి వరుసగా తెలుగులో అవకాశాలు కూడా వచ్చాయి. తాజాగా ఈ నటి తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన మహారాజా సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా జూన్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన ప్రేమ కథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

మమతా తాజాగా మాట్లాడుతూ ... నేను లాస్ ఏంజెల్స్ లో ఉన్న సమయంలో ఒకరిని ప్రేమించాను. కాకపోతే ఆ ప్రేమ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. లైఫ్ లో రిలేషన్ ఉండాలి. కాకపోతే ఆ రిలేషన్ ఎప్పుడు కూడా ఒత్తిడితో ఉండాలి అని నేను కోరుకోవడం లేదు. లైఫ్ లో ఖచ్చితంగా ఒక తోడు అవసరం అని నేను అసలు భావించడం లేదు. ప్రస్తుతం నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం. మంచి జీవిత భాగస్వామి కోసం ప్రస్తుతం నేను వెతుకుతున్నాను. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు మీ అందరికీ చెబుతాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mmd