యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా నటించిన చిత్రం హరోం హర. గత ఏడాది హంట్, మామా మశ్చింద్ర మూవీలు ఆయనకు నిరాశనే మిగిల్చాయి. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు హరోం హర చిత్రంతో సుదీర్ బాబు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ పిరియాడిక్ యాక్షన్ మూవీ నేడు అనగా జూన్ 14న థియేటర్లలో రిలీజ్ అయింది.

టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సుదీర్ ఈ చిత్రం పై చాలా నమ్మకం వ్యక్తం చేశాడు. ఇక దీంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలోనే హరోం హర మూవీ టీం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హరోం హర చిత్రం రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చింది మూవీ టీం. ఆన్లైన్ ప్లాట్ఫారం బుక్ మై షో లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

హరోం హర అనే కోడ్ను అప్లై చేయడం ద్వారా బుక్ మై షో లో ఈ ఆఫర్ పొందవచ్చు. బుక్ మై షో లో మూడు టికెట్లను సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసేముందు హరోం హర కూపన్ కోడ్ అప్లై చేస్తే రెండు టికెట్లు ధ‌రకే 3 వస్తాయని టీం వెల్లడించింది. ఇక హర హర చిత్రానికి జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు కి జోడిగా మాల్వికా శర్మ హీరోయిన్ గా నటించింది. సునీల్ అండ్ జయప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం 2 గంటల 34 నిమిషాల రన్ టైం తో వచ్చింది. హరోం హర మూవీ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఈ చిత్రంలో గన్ లు తయారుచేసి విక్రయించే సుబ్రహ్మణ్యం పాత్రలో సుధీర్ బాబు నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: