సాధారణంగా ఫ్యాన్ వార్స్ చూస్తూనే ఉంటాం. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకుంటూ ఉంటారు. కానీ, అదే ఫ్యాన్స్ కొన్నిసార్లు తమ హీరో చేసింది తప్పు అయితే తప్పే అని చెప్పుకొస్తారు.ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు. కొంతమంది బన్నీకి సపోర్ట్ చేస్తుండగా.. కొంతమంది అతను చేసింది తప్పే అని చెప్పుకొస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం వలనే మనిషి గొప్పవాడు అవుతాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ, బన్నీ ఇప్పుడు చేసింది అందుకు విరుద్ధంగా ఉందని చెప్పుకొస్తున్నారు.మొదటి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి బయటకి వచ్చి తనంతట తానుగా అల్లు ఫ్యామిలీని.. మెగా ఫ్యామిలీ అంత గొప్పగా చేయాలనీ బన్నీ ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందులో చాలావరకు సక్సెస్ కూడా అయ్యాడు. మెగా కుటుంబం నుంచి వచ్చినా కూడా తన నటనతో.. డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించి ఐకాన్ స్టార్ గా మారాడు. అయినా కూడా ఇంకా ఏదో కావాలనే తపన బన్నీలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు పుష్ప 2 తో గ్లోబల్ స్థాయికి మారాలని చూస్తున్నాడు.ఎప్పటినుంచో #Allu- #Mega మధ్య ఈ పోరాటం నడుస్తోంది. కానీ, ఎవరు బయటపడలేదు. మెగా ఇంట్లో ఫంక్షన్స్ కు బన్నీ కావాలని డుమ్మా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. స్టైలిష్ స్టార్ గా మారి..

 తనకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకున్నప్పుడే చెప్పను బ్రదర్ అని చెప్పి మెగా కుటుంబానికి ఇన్ డైరెక్ట్ గా తాను ఎదిగాను అని చెప్పేశాడు. అప్పటినుంచి ఫ్యాన్స్ లో కొంత అలజడి నెలకొంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే.. బన్నీ ఫ్యాన్స్ లో చాలామంది మెగా అభిమానులే.మొదటినుంచి కూడా అతనికి సపోర్ట్ గా నిలబడింది కూడా మెగా అభిమానులే.ఏం పీకలేరు బ్రదర్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. ఇది ఇంతలా ట్రెండ్ అవ్వడానికి ఒక్క అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కారణం అనడానికి లేదు. యాంటీ మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి చేస్తున్న రచ్చ. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని ‘సరైనోడు’ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ను అభిమానులు అడిగితే.. ‘చెప్పను బ్రదర్’ అంటూ ఓ డైలాగ్ వేశాడు.దీనికి పవన్ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ ను భారీగా ట్రోల్ చేశారు. అప్పటి నుండీ కొందరు పవన్ ఫ్యాన్స్…. అల్లు అర్జున్ ను మెగా హీరోగా చూడమని చేసిన కామెంట్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఈ విషయం పై అల్లు అర్జున్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు కూడా. కొంతమంది పవన్ అభిమానుల వల్లే తను అలా మాట్లాడాను అంటూ తన మనసులో ఉన్నది బయటపెట్టాడు. అతని మాటల్లో తప్పేమి లేదని మద్దతు పలికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: