బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి తర్వాత నుండి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమాలను చేయాలి అని దర్శక నిర్మాతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనకి కోట్లల్లో  ఇస్తున్నారు.

 ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ రెండు నుండి మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న కల్కి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇక ఈ సినిమాతో పాటు అటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా సైతం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోతున్నాడు. అలాగే సందీప్ రెడ్డి  దర్శకత్వంలో సైతం ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి

 వలస సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్. అయితే తాజాగా ఇప్పుడు ప్రభాస్ మరొక స్టార్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ప్రభాస్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ సైతం ఇచ్చినట్లుగా సమాచారం. ఇక అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ టి. సిరీస్ గతంలో ప్రభాస్ తో ఆది పురుష్ సినిమాను చేశారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విషయాన్ని అందుకోకపోవడంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగెటివిటీ వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి టి సిరీస్ తో ప్రభాస సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వార్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తో ఒక సినిమా చేయబోతున్నాడట ప్రభాస్. ఇప్పటికే కథకి సంబంధించిన పనులు పూర్తయ్యాయని త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లబోతున్నట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: