స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ కి పుష్ప ఊహించిన విజయాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమా దెబ్బకు ఆయన ఐకాన్ స్టార్ గా అవతరించడమే కాదు నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రెండో భాగం మీద భారీ అంచనాలు ఉండడంతో స్వయంగా తానే నిర్మిస్తూ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సినిమాను ఒక రకంగా చెక్కుతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ వాయిదా

 పడుతూ వచ్చింది. చివరిగా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ రోజు కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనే వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.  ఆగస్టు 15 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఆ మధ్య రిలీజ్ వాయిదా పడనుందని ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి. కానీ వాటిని కొట్టి పారేస్తూ మేకర్స్ చెప్పిన టైంకి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కావడం లేదని ఓ షాకింగ్ న్యూస్

 బయటికొచ్చింది..ఈ సినిమా రిలీజ్ ఆగస్టు లో వాయిదా పడితే డిసెంబర్ లో రిలీజ్ చేసందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.సెప్టెంబర్ లో దేవర ,అక్టోబర్ లో గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ ఉండటంతో ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్ ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట.ఈ సాంగ్ లో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రి నటిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో ఆగష్టు 15 న సినిమా రిలీజ్ వాయిదా వేయనున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: