రవితేజ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అతని సహజ నటన ఎనర్జీ. ఈ రెండు మెండుగా ఉన్న ఏకైక హీరో రవితేజ మాత్రమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్ది మంది జాబితాలో రవితేజ ఒకరు. మాస్ మహారాజా గా పేరు తెచ్చుకొని ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో డౌన్ టూ ఎర్త్ పర్సన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత ఠక్కున చెప్పే పేరు మాస్ మాహారాజా రవితేజ.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుని ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస లో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. బ్యాక్ టూ బ్యాక్ లతో థియేటర్లలో సందడి చేస్తుంటారు. ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ కు డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

అందులో రవితేజ పై ప్రశంసలు కురిపిస్తూ కొన్ని ఫోటోస్ షేర్ చేశాడు. ఆఫోటోలో రవితేజ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతూ కనిపించారు. మెడ నొప్పి తగ్గడానికి మెడ పై బ్యాండ్ పెట్టుకుని కూర్చోగా.. హరీశ్ శంకర్ పక్కనే బ్యాండ్ పట్టుకుని కూర్చున్నాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “మాస్ మాహారాజా డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నా షూటింగ్ చేస్తున్నారు. థాంక్యూ అన్నయ్య. ప్రతి రోజు మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తావు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ నొప్పితో ఉన్నప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సె కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన రైడ్ కు రీమేక్ గా వస్తున్న మూవీ ఇది. ఇందులో బిగ్ బికి రవితేజ పెద్ద ఫ్యాన్ గా కనిపించనున్నారు. ఈ ను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: