ఇండియన్ సినిమాలో ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటిని ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే అనిపిస్తాయి. అలాంటి సినిమానే హమ్ ఆప్ కే హై కౌన్1990ల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు ఉన్న ఈ మూవీ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీయే ఉంది. అదేంటో చూడండి.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అతి పెద్ద హిట్ ఈ హమ్ ఆప్ కే హై కౌన్ మూవీ. 1994లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఓ మంచి ఫ్యామిలీ డ్రామా అయిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎగబడి చూశారు. థియేటర్లలో వందల రోజులు ఆడింది. సూరజ్ బార్జాత్యా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించింది.అయితే ఈ సినిమా ఆఫర్ మొదట ఆమిర్ ఖాన్ కు వెళ్లిందట. ఈ సినిమాలోని ప్రేమ్ పాత్రకు కావాల్సిన అమాయకత్వం ఆమిర్ లో ఉందని భావించిన డైరెక్టర్ సూరజ్.. మొదట కథను అతనికే వినిపించాడట. కానీ స్క్రిప్ట్ తనకు అంతగా నచ్చలేదంటూ ఆమిర్ ఆ సినిమాను వదులుకున్నాడు. దీంతో ఇదే కథను సల్మాన్ కు వినిపించడం.. అతడు అంగీకరించడం, కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలవడం జరిగిపోయాయి.

1994లో రిలీజైన హమ్ ఆప్ కే హై కౌన్ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ బాంధవ్యాలను మనసుకు హత్తుకునేలా చెప్పిన తీరు బాగుంటుంది. ఇక సూపర్ హిట్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ జోడీ మ్యాజిక్ చేసింది. వీళ్ల కెమెస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.దీంతో థియేటర్లలో ఈ మూవీ ఓ రేంజ్ లో ఆడింది. కొన్ని థియేటర్లలో ఏడాదంతా ఆడటం విశేషం. ఈ సినిమా అప్పట్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ ఘనత సాధించిన తొలి సినిమా ఇదే. 1990ల్లో వచ్చి అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. అంతేకాదు ఇప్పటి ధరలతో పోలిస్తే బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగానూ నిలుస్తోంది.సల్మాన్ ఖాన్ కెరీర్ ను మరోసారి గాడిలో పెట్టిన సినిమా ఈ హమ్ ఆప్ కే హై కౌన్. ఈ సినిమా చేసే సమయానికి సల్మాన్ పరిస్థితి అసలు ఏమాత్రం బాగా లేదు. కెరీర్ గాడి తప్పింది. ఆర్థికంగానూ ఇబ్బందుల్లో ఉన్నాడు. కేవలం డబ్బు కోసమే ఈ సినిమాను అతడు అంగీకరించడం గమనార్హం. మొత్తానికి అది ఫలించింది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతోపాటు సల్మాన్ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.నిజానికి అంతకు ఐదేళ్ల ముందు మైనే ప్యార్ కియా సినిమా ద్వారానే అతడు హీరోగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది కూడా ఈ సూరజ్ బార్జాత్యానే. అప్పట్లో ఆ సినిమాలో ఓ సంచలనం. సల్మాన్, భాగ్యశ్రీ జోడీ సిల్వర్ స్క్రీన్ పై పండించిన లవ్ స్టోరీ చాలా ఏళ్ల పాటు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: