పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో అన్న విషయం మన అందరికీ తెలిసిందే. లేకపోతే పవన్ స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే వివాహం చేసుకున్నాడు. కానీ ఆయన మొదటి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చాలా తక్కువ రోజుల్లోనే పవన్ కి తన మొదటి భార్యకు మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు. ఇక పవన్ ఆ తర్వాత సినీ నటి అయినటువంటి రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి మొదట బద్రి అనే సినిమాలో నటించారు.

మూవీ సమయం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జానీ సినిమాలో నటించారు. ఆ సమయంలో వీరి ప్రేమ మరింత ముదిరింది. దానితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఇక వీరి మధ్య కూడా కొన్ని మనస్పర్ధలు రావడంతో పవన్ , రేణు దేశాయ్ ఇద్దరు కూడా విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , అన్నా లేజ్నేవా అనే విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇన్ని రోజుల పాటు ఈమె ఎక్కువ బయట కనిపించలేదు. ఏదో కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే బయట కనిపించేది.

ఇక పవన్ ఈ సారి ఎలక్షన్లలో అద్భుతమైన విజయం సాధించడంతో ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటే ఈమె ఉంటుంది. దానితో ఈమె గురించి అనేక విషయాలు తెలుసుకోవాలి అని జనాలలో ఆసక్తి బాగా రేకొంది. ఇక ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రష్యాకు చెందిన ఈమె ఒక మోడల్ మరియు నటి. తీన్మార్ సినిమా సమయంలో ఈమె పవన్ ను కలిశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 2013 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఈమెకు దాదాపు 1800 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: